Kethireddy: టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ తాజా పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పొత్తులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు క్రెడిబులిటీ లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను టీడీపీ నేతలే ఓడిస్తారంటూ జోస్యం చెప్పారు.. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో పవన్ కల్యాణ్ చెప్పాలని నిలదీశారు.. గతంలో ఎందుకు విడిపోయారు.. ఇప్పుడెందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలని ప్రశ్నించారు.
Read Also: Tollywood Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో హీరో నవదీప్
ఇక, ఓట్లు సంపాదించేందుకు ఎవరైనా రాజకీయ పార్టీలు పెడతారు.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ పెట్టానంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కు చాలా తేడా ఉందని పవన్ గుర్తించాలని సూచించారు.. మరోవైపు.. టీడీపీ – జనసేన పొత్తు వల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లను విమర్శించి ఇప్పుడు వారితోనే పొత్తు అనడం అవివేకం అని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు. అసలు పవన్ కల్యాణ్ బీజేపీతో సంప్రదించారో లేదో తెలియదని పేర్కొన్నారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.