ఏపీలో పీఆర్సీ పై మండిపడుతున్న ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ పట్టువీడాలని ప్రభుత్వం కోరుతూనే వుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు. ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఇలాంటి ఆందోళనలు మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు తల్లి లాంటిది.. ఉద్యోగులకు సీఎం జగన్ తప్పకుండా మేలు చేస్తారని ఆశాభావం వ్యక్తం…