మంచి తరుణం మించిన దొరకదు…., దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం…, దుమ్ము దులిపేద్దామన్నట్టుగా ఆ ఎమ్మెల్యే మనుషులు వసూళ్ళ పర్వానికి తెర లేపారా? మాట వినే అధికారులను డిప్యుటేషన్ మీద రప్పించుకుని మరీ… వ్యవహారాలు చక్కబెట్టేసుకుంటున్నారా? అసలక్కడ ఉద్యోగం చేయాలంటేనే… రెగ్యులర్ ఎంప్లాయిస్ భయపడే పరిస్థితి వచ్చిందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పరిధి చిన్నదే అయినా… పొలిటికల్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్. ఇక్కడి నుంచి 2024ఎన్నికల్లో జనసేన తరపున…