మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లా మంత్రులు ఒక్కటై తిరుగుబాటు చేయడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. ముందెన్నడూ లేనివిధంగా బహిరంగంగా ఓ మంత్రిపై జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడటం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మార్కెట్ కమిటీ నియామకం వివాదంలో.. మంత్రి మల్లారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఆ రహస్య సమావేశానికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే శంకుస్థాపనకు వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అవమానం జరగడం.. పార్టీలో తీవ్ర చర్చగా మారింది.…