వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు..
MP Appalanaidu : హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబర్ లో కూడా టీడీపీ సభ్యత్వాలు జరగనున్నాయన్నారు. మే లో కడపలో టీడీపీ మహానాడు జరుగుతుందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి కావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఢిల్లీలోను లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం…
Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి.…
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి.…
రాష్ట్రంలో గత రెండు రోజుల పరిణామాలు చూస్తే రాజకీయ కుట్ర అనేది స్పష్టం అవుతుంది అని వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని మేము చేసిన ఆరోపణలు వాస్తవం అని ఇవాళ స్పష్టం అయ్యింది అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు భోజనం తెచ్చినప్పుడు కూడా బానే ఉన్నారు. కోర్టుకు చక్కగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కానీ కోర్టులో బెయిల్ రిజెక్ట్…