రాష్ట్రంలో గత రెండు రోజుల పరిణామాలు చూస్తే రాజకీయ కుట్ర అనేది స్పష్టం అవుతుంది అని వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని మేము చేసిన ఆరోపణలు వాస్తవం అని ఇవాళ స్పష్టం అయ్యింది అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు భోజనం తెచ్చినప్పుడు కూడా బానే ఉన్నారు. కోర్టుకు చక్కగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కానీ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అవ్వగానే కొత్త డ్రామాకు తెర తీశారు అని అన్నారు. రఘురామ పై సీబీఐ కేసులు ఉన్నాయి. వాటి నుంచి బయట పడేస్తామని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకు కుట్రలో భాగంగా వాడుకుంటున్నారు అని తెలిపారు.