Tirupati dead bodies: తిరుపతి జిల్లా పాకాల- చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు.. అవి హత్యలా లేక ఆత్మహత్యలా అన్నది తేల్చని పరిస్థితి ఉంది. అయితే మృతులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన సెల్వన్, జయమాలిని అన్నా చెల్లెలుగా పోలీసులు గుర్తించారు. అంతే కాదు పెద్ద ఎత్తున ఫైనాన్స్ వ్యాపారం చేసినట్టు చెబుతున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు…