కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “మిస్ ఇండియా”. గత ఏడాది ఓటిటిలో విడుదలై ఫర్వాలేదన్పించుకుంది ఈ చిత్రం. కీర్తి సురేష్ కు 20వ చిత్రమైన “మిస్ ఇండియా” తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆ హిందీ వెర్షన్ కు రెండు రోజుల్లోనే ఏకంగా 2.6 కోట్ల వ్యూస్, 7.2 లక్షల లైకులు, 21 వేల కామెంట్స్…