సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2…