ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ ప్రతిభను ప్రదర్శించి కొన్ని సినిమా అవకాశాలను అందుకోవడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన నటి మృణాళిని రవి. పుదుచేరిలో పుట్టి పెరిగిన మృణాళినికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మృణాళిని రవి టిక్ టాక్ ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించింది. 2019లో త్యాగరాజ కుమారరాజా దర్శకత్వంలో వచ్చిన సూపర్…