డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు.
బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.