స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ అనంతరం మీడియాతో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అన్ని ఎమ్మెల్సీ స్థానాల గెలుపు నల్లేరు మీద నడకే. ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచాం, ఇంకా పెంచుతాం. ఎంపీటీసీలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. ఇక తమను రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలి. ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలి అని తెలిపారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్ మట్కాడుతూ… వరంగల్ జిల్లా…
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్ ఆసుపత్రిలో వార్డు ఏపాటు చేసారు. ఈ విషయం పై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… 10 బెడ్స్ తో కూడిన వార్డ్ ఏర్పాటు చేసాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారు. కోవిడ్ లో వైద్యలు ప్రాణాలకు తెగించి పని చేసారు.. ఇక ముందు కూడా…
తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు భారీ స్థాయిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా మేడారం జాతరకు పేరుంది. ఈ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు విడుదల చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని…
మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… క్రిష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో….ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు తిరుమల…
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది.. అయితే, ఇవాళ బయ్యారం ఉక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్… మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.. ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందన్న ఆమె… ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటు…
చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఉన్నాడు ఓ వృద్ధుడు. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వార్త విన్న గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ చేసి భరోసా కల్పించారు. రెడ్యాతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామన్నారు.…
ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల…