PM Modi: గూగుల్ ఏఐ టూల్ జెమిని, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయింది. ఐటీ నియమాలను, క్రిమినల్ కోడ్‌ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గుగూల్‌కి వ్యతిరేకం చర్యలు ఉంటాయని అన్నారు. మోడీపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెమనీ పక్షపాతంతో కూడిన సమాధానం చెప్పినట్లు ఓ జర్నలిస్టు సమస్య తీవ్రతను లేవనెత్తారు.
Deepfake Issue: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్‌ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా…
Tata To Make iPhones: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 115 ఏళ్ల టాటా సంస్థ ఉప్పు నుంచి టెక్నాలజీ దాకా ఎన్నో రంగాల్లో ఉంది. ఇకపై టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. టాటా గ్రూప్ రెండున్నరేళ్లలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఇది భారతదేశ ఉత్పత్తి…