తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం యమరంజుగా వుంటుంది. తాజాగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ ఒక బడుద్ధాయి అనేశారు రాజా. టీడీపీ నేతలు శవాల దగ్గర నెత్తురుకూడు తినే సన్నాసులు అని విప్ దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో తెలుదేశం పార్టీకి తాడు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి,…
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు నేతలు గౌతమ్‌రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి చనిపోయారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్ సానుభూతి తెలిపారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా గౌతమ్‌రెడ్డితో తనకు పరిచయం ఉందని… రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు…
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు.…
మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొని హుటాహుటిన…
ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీనో.. సొంత వ్యాపార కార్యకలాపాల్లోనూ అంతే బిజీగా ఉంటారట. దాంతో నియోజకవర్గంలో ప్రజలకు చిక్కరు.. దొరకరనే ముద్ర పడిపోయింది. ఎవరా మంత్రి? ఆత్మకూరులో మంత్రి చిక్కరు.. దొరకరు..? మేకపాటి గౌతంరెడ్డి. ఏపీ మంత్రి. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సీఎం జగన్‌కు సన్నిహితమనే ముద్ర ఉంది. మేకపాటి కుటుంబానికి సొంత వ్యాపారాలు ఎక్కువే. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి రెండోసారి గెలిచిన గౌతంరెడ్డి తమ…