తూర్పుగోదావరిలో జిల్లా పరిషత్ సమావేశం వాడి వేడిగా సాగింది. సంపూర్ణ గృహ హక్కు పథకం, విద్య, వైద్యం, నాలుగు వ్యవసాయ అంశాల పైనే చర్చ జరిగింది. ఈ జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరును తప్పు పట్టి విమర్శలు చేసారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మేల్సీ చిక్కాల రామచంద్రరావు. దానిపై మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ… జగనన్న సంపూర్ణ గృహ హక్కు…