అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.
2023-24 ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.