మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు ఆప్కాబ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. రైతులకు రుణాలు అందజేత అంశంపై సమీక్షించనున్నారు. అయితే.. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అక్రమంగా దారి మళ్లించిన సహకార సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. అధికారులే బినామీ…