మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు.. కోరుట్ల డిఎస్పీ.. ప్రమాద స్థలాన్ని…