CMS-03: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ను ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 2 ఆదివారం రోజున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటిలైట్ ప్రయోగం జరుగనుంది. ఇది మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనిని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) ద్వారా ప్రయోగించనున్నారు.