Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైన, పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల్ని కాల్చిచంపారు. ఆదివారం రోజు గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ వద్ద నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు భవన కార్మికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.