Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ఘనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం అని ఆయన అన్నారు. “గాలి మాటలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు?” అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న ఉద్యోగుల…
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం (MDM - Mid Day Meal) పథకాన్ని అమలు చేసే వంటకార్మికులు ఎన్నో నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు బిల్లులు ఆలస్యమవడం, చెల్లింపులు సమయానికి జరగకపోవడంతో వారు అప్పులు తెచ్చుకుని పని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఢిల్లీ బాసులు, మీ గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం కాదు, ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టాలని సూచించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్, పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు తిండి పెట్టడంలో లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కీమ్‌ను…