కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు.