Telangana Cabinet : హైదరాబాద్‌లో సోమవారం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయంగా, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ తేల్చింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్…