ఈ మ్యాచ్ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘ఈ రోజు మేము ఆడిన విధానం చాలా సంతోషం కలిగించింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో చాలా నిరాశపడ్డాం. కానీ ఈ రోజు మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను అమలు చేశాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు.…