జేఎస్‌బ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో కొత్త మలుపు తీసుకొస్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యంత చౌకైన ఈవీ ఎంజీ కామెట్ మంచి వృద్ధి సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ.. కామెట్ ఈవీకి చెందిన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ (MG Comet EV Blackstorm) వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త బ్లాక్‌స్టార్మ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.80 లక్షల నుంచి ప్రారంభం కానుంది.