అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు పొడిగించారు. ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును మోడీ ప్రారంభించారు. అనంతరం సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని మోడీ మెట్రో రైడ్ చేశారు. ఈ సందర్భంగా రైల్లో విద్యార్థులతో ముచ్చటించారు. జూన్ 9న 3.0 ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Hyderabad Youth Died: కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం..
ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్ట్ ప్రజలకు మెరుగైన సేవలు అందించనుంది. పట్టణ మరియు విద్యాకేంద్రాల మధ్య ప్రయాణించే పర్యాటకులకు మెరుగైన సేవలను అందించనుంది. ఇక ఈ సేవలు సెప్టెంబర్ 17న (మంగళవారం) ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకు..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీ (GNLU), పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU), GIFT సిటీ, రేసన్, రాండేసన్, ధోలకువా, ఇన్ఫోసిటీ మరియు సెక్టార్-1 వంటి ప్రధాన స్థానాలను అనుసంధానిస్తుంది. మొత్తం వ్యయం రూ.5,384 కోట్లు. AFD (ఫ్రాన్స్) మరియు KfW (జర్మనీ)తో సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులు రాబట్టింది. ఈ మెట్రో రైలు అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ప్రయాణికులు APMC నుంచి GIFT సిటీకి సుమారు రూ. 35 ధరతో గంటలోపు ప్రయాణించవచ్చు.సెక్టార్-1 మెట్రో స్టేషన్ నుంచి మోటెరా స్టేడియం మెట్రో స్టేషన్ వరకు సేవలు ఉదయం 7:20 నుంచి సాయంత్రం 6:40 వరకు నడుస్తాయి. GNLU మెట్రో స్టేషన్ మరియు GIFT సిటీ మెట్రో స్టేషన్ మధ్య నడిచే రైళ్లు ఉదయం 8:20 నుండి సాయంత్రం 6:25 వరకు అందుబాటులో ఉంటాయి. GIFT సిటీ మెట్రో స్టేషన్ నుంచి GNLU మెట్రో స్టేషన్ వరకు సేవలు ఉదయం 7:18 నుంచి సాయంత్రం 6:38 వరకు నడుస్తాయి. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఫ్రీక్వెన్సీ మరియు సమయాలను తర్వాత దశలో పెంచే అవకాశం ఉంది.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurated the Ahmedabad Metro Rail Project
Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel were also present. pic.twitter.com/mXEayEmWRh
— ANI (@ANI) September 16, 2024
#WATCH | Ahmedabad: Prime Minister Narendra Modi along with Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel takes a metro ride from Section 1 Metro Station to GIFT City Metro station after inaugurating the Ahmedabad Metro Rail Project. pic.twitter.com/7yQLJdK9eW
— ANI (@ANI) September 16, 2024
#WATCH | Ahmedabad: Prime Minister Narendra Modi along with Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel takes a metro ride from Section 1 Metro Station to GIFT City Metro station after inaugurating the Ahmedabad Metro Rail Project. pic.twitter.com/prSTwWsvcS
— ANI (@ANI) September 16, 2024
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Ahmedabad Metro Rail Project
Gujarat Governor Acharya Devvrat and Chief Minister Bhupendra Patel are also present. pic.twitter.com/yLxEu828b2
— ANI (@ANI) September 16, 2024