కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ రోజు అధికార నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరారు. అదే విధంగా.. నియోజకవర్గంలోని 7 రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ స్కీమ్ (CRIF) పరిధిలో నిధులను మంజూరు…