కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్… ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఔషధాలపై మాత్రం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్ రూపొందించిన ఔషధం… ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు తెలిపింది. త్వరలోనే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్ ఫార్మా వెల్లడించింది.రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిక్స్ భాగస్వామ్యంతో… మెర్క్ ఫార్మా సంస్థలు మాత్ర…