Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరూ మైనర్లు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన బాలికలుగా పోలీసులు గుర్తించారు. మృతుల పేర్లు వినీల (17), అఖిల (16). వినీల ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకొచ్చారు.