ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ టీ20లో టాస్‌ను నెగ్గిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. టీమిండియాకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్ 5 పరుగులకే అవుట్ అయ్యారు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్…