ఏ దేవాలయాన్ని చూసినా భగవంతుని నామస్మరణతో ప్రశాంతంగా మారుమ్రోగుతుంది. దేవాలయాలలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కానీ మెహందీపూర్ బాలాజీ ఆలయం అలా కాదు. అక్కడ అడుగు పెట్టాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. అక్కడికి వెళ్తే వణుకు పుడుతుంది. తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఆలయాలు ఇలా ఉంటాయా అనే సందేహం కలుగుతుంది. అక్కడ వారు అనుసరిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను చూసి ముక్కున వేలేసుకుంటారు. అది అక్కడి భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇది దుష్టశక్తులను పారద్రోలే ఆలయంగా పేరుగాంచింది.…