Chiranjeevi: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 60 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో ‘అడవి దొంగ’ సినిమా చూపిస్తూ వైద్యులు ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా మహిళ మెదడులో కణతులు తొలగించారు. ఆపరేషన్ చేస్తున్న వైద్యులు మధ్యమధ్యలో మహిళతో మాటలు కలుపుతూ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ వార్త శుక్రవారం నాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీ ఆస్పత్రికి…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్…