మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు.…