సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల బహిరంగ సభలో ఆయన మట్లాడారు. ఈ మధ్య కొన్ని శక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాయని అన్నారు. మతాల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే వారికి అధికారం పోతే అభివృద్ధి కుంటు పడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడే కొంతమంది…