గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా…