Medchal Wife Murder: అనుమానం.. ఆమె ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను.. అక్కడికి వెళ్లి మరీ అతి కర్కశంగా నరికేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగింది. ఆమె పేరు మంజుల. ఈమెకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూర్‌కు చెందిన బోడ శంకర్‌తో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.…