సొంత జిల్లాలో మంత్రి ఒంటరయ్యారా? పార్టీ సీరియస్‌గా ఫైట్ చేస్తున్న అంశంలో మంత్రితో జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు కలిసి రాలేదా? ఏక్ నిరంజన్‌గానే కార్యక్రమం నడిపించేశారా? జిల్లాలో గ్రూపుల గోలపై పార్టీ వర్గాలకు క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ ఎవరా మంత్రి? జిల్లాలో మంత్రితో కలిసిరాని ఎమ్మెల్యేలు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరికి వారుగా విడిపోయి గ్రూపులు కట్టారు. ఎప్పట్నుంచో జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి…