హైదరాబాద్‌లో వీధికుక్కల బెడద కొనసాగుతుండగా.. తాజాగా ఎలుకలు కూడా రంగంలోకి దిగాయి. ఓ హోటల్‌లో ఓ బాలుడిపై ఎలుక దాడి చేసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్డొనాల్డ్స్ను పునఃప్రారంభించారు. దిగ్గజ ఫాస్ట్పుడ్ సంస్థ మెక్డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది.…