World's Richest Family: 700 కార్లు, రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఇదిల ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం సొంతం. ఈ కుటుంబం మరేదో కాడు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(ఎంబీజెడ్) ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. దుబాయ్‌లోని ఎంబీజెడ్ కుటుంబం రూ. 4087 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇది మూడు పెంటగాన్‌ల పరిమాణంలో ఉంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం…