Crime News: ప్రస్తుతం ఉన్న యువతకు జీవితం విలువ తెలియడం లేదు. చిన్నదానికి, పెద్దదానికి ఆత్మహత్యే సరైన పరిష్కారమంటూ చావుతో చెలగాటలాడుతున్నారు. ఫోన్ పోయిందని, అమ్మానాన్న కొట్టారని, ఫెయిల్ అయ్యామని, ప్రియురాలు వదిలేసిందని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందరిలా చేయి, గొంతు కోసుకుంటే చనిపోను అనుకున్నాడో ఏమో.. ఏకంగా పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందాడు.