రాష్ట్ర వైద్య విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు కెటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బి కేటగిరీ సీట్లలో కేటాయించే 35శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.