హైదరాబాద్‌లో నేడు వెంగళ్రావునగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారికి కేటీఆర్ చురకలంటించారు. అధికారిక సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిపి, సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని, చైర్మన్లు, మేయర్లను సుతిమెత్తగా మందలించారు. మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలకు…