ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో చేదు వార్త అందింది. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన అసలే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఆ జట్టు నిరాశలో ఉండగా.. తాజాగా కెప్టెన్ పంత్‌కు జరిమానా పడింది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆటగాళ్లను వెనక్కి రావాలని పిలిచిన రిషబ్ పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత పడింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్…