ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను తీసుకొస్తున్నాయి. మారుతి సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలి ఎలక్ట్రిక్ కారు మారుతి ఈ-విటారాను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీనిలో స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్‌లు, బలమైన బంపర్ కనిపిస్తాయి. దాని సైడ్ ప్రొఫైల్‌లో, ఫెండర్‌పై మందపాటి క్లాడింగ్, భారీ డోర్ మోల్డింగ్, R18 ఏరోడైనమిక్ అల్లోయీస్ కనిపిస్తాయి. వెనుక భాగంలో, టెయిల్ లాంప్‌లు…
మారుతి సుజుకి అనేక కార్ మోడల్స్, పవర్‌ట్రెయిన్ ఎంపికలతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పటి వరకు మారుతి ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయలేదు. ఇతర కంపెనీల నుండి చాలా ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారాను లాంచ్ చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో ఇండియాలో ప్రారంభించనున్నారు.