(అక్టోబర్ 8న దర్శకుడు మారుతి పుట్టినరోజు)నవతరం మెచ్చే చిత్రాలను తీస్తూ, తనదైన బాణీ పలికించారు దర్శకుడు మారుతి. కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగానూ మారుతి సక్సెస్ రూటులో సాగారు. యువతను ఆకట్టుకొనే అంశాలను చొప్పించి, జనాన్ని మెప్పించడంలో మేటిగా నిలిచారు మారుతి. మచిలీ పట్నంలో 1973 అక్టోబర్ 8న దాసరి మారుతి జన్మించారు. బందరులోనే విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ కు వచ్చి యానిమేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత వెహికల్స్ కు సైన్ బోర్డ్స్, నంబర్…