పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లింది. అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారిని.. పెళ్లి పందరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకునే వరకు తామ పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగింది.