బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లి వేడుక దగ్గర్లో ఉండగానే.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి కూతురుగా కనిపించబోతుందట.. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా రాబోతుందట. వీరిద్దరూ కలిసి ‘దబాంగ్’ లో…
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి…
సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే కారణం మాత్రం ఎవరికి తెలియదు. తాజగా ఆ కారణాన్ని టబు రివీల్ చేసింది. తాను సింగిల్ గా ఉండడానికి కారణం ఒక స్టార్ హీరో అని చెప్పి షాకిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అన్న ప్రశ్నకు సమాధానమిచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వలనే తాను ఇలా సింగిల్…
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చిత్ర పరిశ్రమలో గుప్పుమన్న విషయం తెల్సిందే. అమ్మడు కూడా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక చిట్ చాట్ లో పాల్గొన్న కత్రినాకు విక్కీతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి కత్రినా ఊహించని సమాధానం చెప్పి అందరిని షాక్ కి గురిచేసింది. “నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల…
తెలుగమ్మాయి అంజలి ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ హోమ్లీ బ్యూటీకి గాసిప్ లతో ఇబ్బంది తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నటి అంజలి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన అంజలి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి…