ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి దంపతులు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని మార్క్‌ను కలిశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స…