ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్…