ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఉత్సాహంగా గడుపుతున్నారు. 79 ఏళ్ల వయసులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా సోమవారం మలేసియాకు వచ్చారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగగానే స్థానిక కళాకారులు డాన్స్‌తో స్వాగతం పలికారు.